ధర్మవరం పట్టణంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ధర్మవరం పట్టణానికి చెందిన జనసేన నాయకుడు బిసి మల్లన్న మిత్ర బృందం ఆధ్వర్యంలో పట్టణంలోని కాలేజీ సర్కిల్ వద్ద కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు.