అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా ఎన్నికల ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో జడ్పిటిసి, యంపిటిసి ల సాధారణ ఎన్నికలు 2025 లను పురస్కరించుకుని ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కె. హైమావతి సమావేశాన్ని నిర్వహించారు. సిద్దిపేట జిల్లాలో 4 రెవెన్యూ డివిజన్లు 6 అసెంబ్లీ నియోజక వర్గాల్లోని 26 మండలాలకు గాను 230 ఎంపిటిసి స్థానాలలోని 3,21,766 పురుషులు 3,34,186 మంది మహిళా ఓటర్లు మరియు 6 ఇతరులు మొత్తం 6,55,958 మంది ఓటర్లు ఉన్నారని, వీరి కొరకు 1168 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చే