దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీపార్వతి రాజరాజేశ్వర స్వామివారిని ఆదివారం (ప్రముఖులు) రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, ఎస్పీ మహేష్ బి.గీతే,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరివార దేవతలకు సైతం పూజలు చేసినట్లు వెల్లడించారు. స్వామివారి దర్శనం తర్వాత అద్దాల మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించగా ఆలయ ఈవో రాధా బాయి లడ్డూ ప్రసాదం అందజేశారు.వారి వెంట ఆలయ అధికారులు,సిబ్బంది ఉన్నారు.