గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మిర్చి యార్డ్ వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మిర్చి యార్డ్ లోని లోడ్ తో వెళ్తున్న లారీ కింద ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. ఈ ఘటనలో మృతుడు శరీర భాగాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. ఈ మేరకు స్థానిక నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.