ప్రకృతి సౌందర్యానికి నిలయమైన మహానంది క్షేత్రంలో అమ్మవారి విగ్రహం వెనుక ఆకాశంలో ఏర్పడిన ఎర్రటి ప్రభ విశేషంగా ఆకట్టుకుంటుంది. బుధవారం సాయంత్రం మహానంది క్షేత్రం లోని అమ్మవారి సుందర విగ్రహం ఒకవైపు, మరోవైపు ఆకాశంలోని ఎర్రటి ప్రభ భక్తులను చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. వేద పండితులు రవిశంకర్ అవధాని ఈ సుందర దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్ లో బంధించారు.