సత్యసాయి జిల్లా రామగిరి మండల కేంద్రంలో గురువారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పరిటాల రవీంద్ర నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ పరిటాల రవీంద్ర 67 జయంతి సందర్భంగా రామగిరి మండల కేంద్రంలో పరిటాల రవీంద్ర నందమూరి తారక రామారావు విగ్రహాలను ఆవిష్కరిస్తున్నామని అందుకు సంబంధించిన ఏర్పాట్లు ని పూర్తి చేయడం జరిగిందని శుక్రవారం పరిటాల రవీంద్ర నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో టిడిపి నేతలు అభిమానులు పాల్గొని విజంతం చేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు.