అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో విద్యుత్తు పోరాట అమరవీరులకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. గుత్తి పట్టణంలోని స్థానిక పట్టణంలోని గాంధీ కూడలిలో గురువారం జరిగిన కార్యక్రమంలో విద్యుత్ పోరాట అమరవీరులైన లాల్ స్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డిల చిత్రపటానికి సీపీఎం నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ గుత్తి మండల కార్యదర్శి వి. నిర్మల మాట్లాడుతూ 2010లో అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న విద్యుత్తు సంస్కరణలకు సిపిఎం ఆధ్వర్యంలో వ్యతిరేకంగా హైదరాబాదులోని బషీర్ బాగ్ లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారన్నారు.