చిత్తూరు జిల్లా. పుంగనూరు నియోజకవర్గం .చౌడేపల్లి మండలం దుర్గ సముద్రం పంచాయతీ. బూటకపల్లి గ్రామం సమీపంలో మురుకు కుంట వద్ద కోడిపందాలు నిర్వహిస్తున్నారని రాబడిన సమాచారం మేరకు చౌడేపల్లి ఎస్సై నాగేశ్వరరావు. పోలీస్ సిబ్బంది దాడులు నిర్వహించారు. కోడిపందాలు నిర్వహిస్తున్న రామ్మూర్తి, ఆనంద్ ను అదుపులో తీసుకొని. రెండు కోడి పుంజులు, రెండు కోడి కత్తులు, 1800 రూపాయలు నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగేశ్వరరావు గురువారం సాయంత్రం 6 గంటలకు ఓ ప్రకటనలు తెలిపారు.