మొబైల్ ల్యాబ్ లతో విద్యార్థులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మంచిర్యాల జిల్లా సైన్స్ అధికారి రాజగోపాల్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం మంచిర్యాల జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల, ముదిగుంట పాఠశాలలో సేవా భారతి తెలంగాణ జిజ్ఞాస ప్రయోగశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు వారి నిత్య జీవితంలో సైన్స్ ఉపయోగాల గూర్చి మానవుని జీర్ణ వ్యవస్థ హృదయ స్పందన మూత్రపిండాల పనితీరు మెదడు వంటి ముఖ్యమైన భాగాల పనితీరును గూర్చి ప్రత్యేక చిత్రపటాల ద్వారా జిల్లా ఇన్స్ట్రక్టర్ లక్ష్మణ్, సహాయకులు సంపత్ విద్యార్థులకు తెలియపరచారు.