గుంటూరు జిల్లా రేవేంద్రపాడు వద్ద శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఒక యువకుడు దుర్మరణం చెందాడు. తెనాలి-విజయవాడ రహదారిపై రేవేంద్రపాడు నుంచి బైక్పై వస్తున్న యువకుడిని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ నుజ్జునుజ్జు కాగా, యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు నూతక్కి గ్రామానికి చెందినవాడని పోలీసులు గుర్తించారు. తెనాలి ఊకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.