మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దారుణమని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాష తన క్యాంపు కార్యాలయంలో మండిపడ్డారు. ప్రైవేటీకరణ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా ఖండిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారన్నారు.పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి రిమ్స్ నిర్మించారని గుర్తు చేశారు. తర్వాత వైఎస్ జగన్ ప్రతి జిల్లాల్లో ఒక్కో మెడికల్ కళాశాలలను నిర్మించారు..పులివెందుల మెడికల్ కాలేజీలో కేటాయించిన 50 సీట్లను కూడా వెనక్కి ఇచ్చిందన్నారు.పేద ప్రజలంటే చంద్రబాబుకు అలుసా అని నిలదీశారు.