హనుమకొండ నగరంలో వినాయక చవితి సందడి నెలకొంది. ఈరోజు వినాయక చవితి సందర్భంగా నగరంలోని పలు కూడళ్ల వద్ద వినాయక చవితి పూజకు సంబంధించిన సామాగ్రిని కొనుగోలు చేసేందుకు ప్రజలు తరలివచ్చారు. పూజకు కావలసిన సామాగ్రిని కొనుగోలు చేశారు ఈసారి పలు స్వచ్ఛంద సంస్థలు కార్పొరేటర్లు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. డివిజన్ వద్ద స్థానిక కార్పొరేటర్ ల ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. రసాయన విగ్రహాలు వాడకుండా మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని వారు తెలిపారు.