జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా, సీబీఐ మాజీ జేడీ వి వి లక్ష్మీనారాయణ సూచనతో శనివారం విశాఖ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (నరవ) ఇంజనీరింగ్ & పొలిటెక్నిక్ కళాశాల విద్యార్థినీ విద్యార్థులతో సామాజిక వనాలు పెంపొందించే విధంగా కాలేజ్ ప్రక్కన ఉన్న కొండపై గంగరావి,మారేడు,మొక్కజొన్న,తురాయి, సీతాఫలం ,సపోటా,వేప, బాదం చింత,కుంకుడు తదితర విత్తనాలతో తయారుచేసిన *విత్తన బంతులు* వేయడం జరిగింది ఈకార్యక్రమంలో పాల్గొన్న కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీ పి ప్రదీప్ వర్మ గారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతీ ఒక్కరూ పాటుపడాలని, విద్యార్థి స్థాయి నుండి అవగాహన పొందాలన్నారు