ఎరువులు కొరత నివారించాలని కోరుతూ తాడేపల్లిగూడెం ఉల్లిపాయలు మార్కెట్ యూనియన్ ఆఫీస్ వద్ద రైతుల విస్తృత స్థాయి సమావేశం ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పుల్లారెడ్డి, నాయకులు సిరపరపు రంగారావు, కసిరెడ్డి శివ మాట్లాడుతూ.. ఈ రాష్ట్రానికి రావలసిన ఎరువుల కోట కేంద్రం నుంచి తెచ్చుకోకుండా రైతులను ఇబ్బంది పెడుతున్న కూటమి ప్రభుత్వం మోసకారి మాటలతో ఎరువులను వాడకాన్ని తగ్గించుకుంటే బస్తాకి 800 రూపాయలు ఇస్తామని ప్రకటన చేయటం విడ్డూరంగా ఉన్నదని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.