జిన్నారం మున్సిపాలిటీలో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిన్నారం–జంగంపేట ప్రధాన రహదారిపై రాయిని చెరువు వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతు మాట్లాడుతూ..వర్షాలు పడినప్పుడల్లా ఇలాగే నీరు రోడ్డుపైకి చేరడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రహదారిపై బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని కోరారు.