యాదాద్రి భువనగిరి జిల్లా: మోత్కూర్ మండల కేంద్రంలోని గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సమావేశాన్ని పోలీసు శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మోత్కూర్ సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని అన్నారు. డీజే లకు అనుమతులు లేదని, ప్రశాంత వాతావరణంలోని నవరాత్రి ఉత్సవాలు జరుపుకొని భక్తులంతా భక్తి భావాన్ని చాటుకోవాలన్నారు.