2000 సంవత్సరం ఆగస్టు 28న హైదరాబాద్ నగరంలోని బషీర్బాగ్ వద్ద పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా వామపక్షాలు నిర్వహించిన ఉద్యమంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుని పోలీస్ కాల్పులకు దారి తీసింది. ఈ కాల్పుల్లో రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామి అనే ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. నేటితో 25 సంవత్సరాలు అయిన సందర్భంగా ముదిగుబ్బ సీపీఎం కార్యదర్శి ఆటో పెద్దన్న ఆధ్వర్యంలో వామపక్షాలు కాల్పుల్లో చనిపోయిన వారికి నివాళులర్పించారు.