విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విధానాలను ఆపాలని రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కోన మోహనరావు, నవ యువ సమాఖ్య రాష్ట్ర నాయకులు నందారపు భాస్కరరావు డిమాండ్ చేశారు. శనివారం బవులువాడలో వారు మాట్లాడారు. ఇప్పటికే విఆర్ఎస్ పేరుతో దశలవారీగా 1150 మంది ఉద్యోగులను,4 000 మంది కాంట్రాక్టు ఉద్యోగుల్ని తొలగించారన్నారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్లోని 32 విభాగాల ప్రవేటీకరణకు బిడ్లు దాఖలు చేయాలని ఈఓఐ ప్రకటించారన్నారు.