యూరియా సరఫరా కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ జిల్లా ఎస్పీ జానకి బుధవారం మాచన్పల్లిలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన యూరియా సరఫరా కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఆమె మాట్లాడుతూ..యూరియా అక్రమ రవాణా, నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా యూరియాను పొందేలా చూడాలని సూచించారు. రైతులు మధ్యవర్తులను నమ్మవద్దని వెల్లడించారు.