అనకాపల్లిలో 126 అడుగుల ఎత్తుతో కూడిన భారీ శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహం ఏర్పాటు కానుంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద గణపతి విగ్రహం కావచ్చని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ విగ్రహం గిన్నిస్ బుక్లో కూడా స్థానం సంపాదించే అవకాశం ఉంది. శిల్పి కామదేను ప్రసాద్ పర్యవేక్షణలో 25 మంది కార్మికులు నెల రోజులుగా ఈ విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. దీని తయారీకి 4 టన్నుల మట్టి, 90 టన్నుల సర్వే కర్రను ఉపయోగించారు.