నేపాల్ దేశంలో కష్టాల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన 40 మంది తెలుగు ప్రజలను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమంలో *రైల్వే కోడూరు ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్* పలు ఎమ్మెల్యే లు మరియు కూటమి ప్రభుత్వ నాయకులతో కలిసి రేణిగుంట విమానాశ్రయంలో స్వదేశానికి చేరుకున్న తెలుగు ప్రజలకు ఘన స్వాగతం పలికారు. నేపాల్ రాయబారి కార్యాలయంతో సమన్వయం చేసి, ప్రత్యేక విమాన ఏర్పాట్లతో బాధితులను తిరిగి తీసుకొచ్చినందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.