సంతనూతలపాడు మండలం మంగమూరులో ఎమ్మెల్యే బి ఎన్ విజయ్ కుమార్ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను సచివాలయ సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు. గ్రామంలో అవ్వ తాతల ఇళ్లకు నేరుగా వెళ్లిన ఎమ్మెల్యే వారికి ప్రభుత్వ నుండి వచ్చిన రూ.4 వేల పెన్షన్ నగదును ఎమ్మెల్యే పంపిణీ చేశారు.. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను లబ్ధిదారులు సద్దినాగం చేసుకోవాలని ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఈ సందర్భంగా సూచించారు.