ధర్పల్లి మండల పరిధిలోని వాడి, నడిమి తండా, బీరప్ప తండా గ్రామాలను మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు సందర్శించారు. ఆయా గ్రామాల్లో పర్యటించిన ఆయన, వరదతో దెబ్బతిన్న పంటలు,రోడ్లు,వంతెనలు,విద్యుత్ లైన్లు, నివాస గృహాలను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని పరిశీలించిన ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.పంటలు నీట మునగడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని బాధిత రైతులు ఆయన ఎదుట గోడు వినిపించారు. హొన్నాజీపేట్ ముత్యాల చెరువు తెగిపోవడంతో దిగువన ఉన్న గ్రామాలపై తీవ్ర ప్రభావం పడిందని స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. నివాస గృహాల్లోకి వరద నీరు చేరడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు