వయోవృద్ధుల సంరక్షణ, సంక్షేమంపై చేసే కేసులను ఆన్ లైన్ పోర్టల్ ద్వారా దాఖలు చేయవలసి ఉంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శనివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ యాక్ట్ - 2007, రాష్ట్ర నియమావళి 2011 ప్రకారం ఇకపై వయోవృద్ధుల సంరక్షణ సంక్షేమం కోసం దాఖలు చేసే కేసులు తెలంగాణ సీనియర్ సిటిజన్స్ మెయింటెనెన్స్ కేసెస్ మానిటరింగ్ సిస్టమ్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా / మీసేవ కేంద్రాల ద్వారా దాఖలు చేయవలసి ఉంటుందని తెలిపారు. ఆఫ్లైన్ లో కేసులు దాఖలు చేసే విధానాన్ని ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసిందని తెలిపారు.