విద్యుత్ శాఖ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల తొలగింపుపై రాజకీయ వివాదం కొనసాగుతోంది. ఉద్యోగులకు మద్దతుగా మాజీ మంత్రి అంబటి నిన్న కోమెరపూడిలో మాట్లాడిన నేపథ్యంలో, TDP నేతలు శుక్రవారం సబ్స్టేషన్ వద్ద సమావేశం నిర్వహించారు. YCP ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల కోసం రూ. లక్షలు చేతులు మారాయని ఆరోపించారు. అంబటి PA రమేశ్, YCP నాయకుడు ఖాజా, విద్యుత్ శాఖలో ఉద్యోగం కోసం తమ వద్ద నుంచి రూ.6 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు.