నల్గొండ జిల్లా, నార్కట్పల్లి మండల పరిధిలోని ఏపీ లింగోటం సమీపంలో గల జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం స్కూటీ దగ్ధమైంది. అది గమనించిన వాహనదారుడు అప్రమత్తమై స్కూటీ దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో స్కూటర్ పూర్తిగా దగ్ధమైంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియ రాలేదు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.