వీ.కోట: మండల పోలీస్ వర్గాలు గురువారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో తెలిపిన సమాచారం మేరకు. ఏడుచుట్ల కోట గ్రామానికి సమీపంలో శ్రీనివాసులు అనే వ్యక్తి రోడ్డు దాటుతున్న సమయంలో వీకోట నుండి తమిళనాడు వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీనివాసులు తీవ్రంగా గాయపడ్డారు గమనించిన స్థానికులు హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటి, పెద్దదిక్కు మరణించడంతో కన్నీరు మున్నీరయ్యారు కుటుంబీకులు.