స్కూల్ బస్సు ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారుడు మరణించిన ఘటన సోమవారం ఉదయం బాపట్ల పాత బస్టాండ్ వద్ద జరిగింది. టీవీఎస్ వాహనంపై వెళ్తున్న వ్యక్తిని వేగంగా వచ్చిన స్కూల్ బస్సు ఢీకొనడంతో అతను ఎగిరిపడ్డాడు.తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కేసు దర్యాప్తులో ఉంది.