వినాయక చతుర్థి సందర్భంగా పర్యావరణాన్ని పరిరక్షించాలని, మట్టి వినాయకుడిని పూజించాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్ లో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా పర్యావరణ అనుకూల వినాయక చవితి అవగాహన కార్యక్రమంలో భాగంగా, సహజ రంగులతో చేసిన మట్టి ప్రతిమలతో 'పర్యావరణ అనుకూల వినాయక చవితిని జరుపుకుందాం' అనే కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ నెల 27వ తేదీన వినాయక చవితిని పురస్కరించుకుని ఈ కార్యక్రమం జరిగింది.