సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరిమ అగ్రవాల్ గురువారం దుబ్బాక పట్టణంలో పర్యటించారు. ఇందులో భాగంగా వనమహోత్సవంలో నాటిన చెట్లను పరిశీలించారు. అదే విధంగా 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసి అటెండెన్స్ రిజిస్టర్ ను తనిఖీ చేసి, హాస్పిటల్లో జరుగుతున్న వైద్యం గురించి ఆరా తీసి పలు సూచనలు చేశారు. అనంతరం దుబ్బాక పట్టణంలోని 15వ వార్డు లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి జిల్లా నందు దుబ్బాక పట్టణం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వెనకబడి ఉందని, ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణాలు తొందరగా అయ్యేందుకు పలు సూచనలు చేశారు. దుబ్బాక రామసముద్రం కట్ట పక్కనగల నీరు ప్రవహించడం పరిశీలించారు