కరీంనగర్ జిల్లా,గంగాధర మండలం,నారాయణపూర్ గ్రామంలోని రిజర్వాయర్ ను గురువారం సాయంత్రం 6 గంటల 20 నిమిషాలకు మండల బి ఆర్ ఎస్ నాయకులతో కలిసి సందర్శించి పరిశీలించారు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్,ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ,లక్షలాది క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతున్న ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోరా అని మీడియా ముఖంగా ప్రశ్నించారు,ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయకపోవడం వల్ల రైతు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని నారాయణపూర్ రిజర్వాయర్ ఆయకట్టు ద్వారా ఒక లక్ష 50వేల ఎకరాలకు నీరు అందుతుందని గత కేసీఆర్ హయాంలో ఎండాకాలంలో కూడా అలుగు పారి మత్తడులు దుమ్కాయని అన్నారు,