మంగళవారం మధ్యాహ్నం 4-30 గంటల ప్రాంతంలో కలెక్టరేట్ మీటింగ్ హాల్లో వైద్య అధికారులతో సీజనల్ వ్యాధులపై మరియు కీటక జనన వ్యాధుల నివారణ పై తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రజల్లో అవగాహన కల్పించాలని ఇంటింటా జ్వరం సర్వేలు డ్రైడే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు.ఈ మధ్యకాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని... భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో డిస్పో గ్లాస్ లలో,కంటైనర్స్ లో వాటర్ నిలిచిపోయి దోమలు వృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందని, డ్రై డే కార్యక్రమంలో భాగంగా నీటి నిలువ ఉన్న....