జిల్లాలో క్యూ ఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం ఎంవిపి కాలనీ, అప్పుఘర్ లోని చౌక ధరల దుకాణం వద్ద జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, విశాఖ తూర్పు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేషన్ డిపో నెంబరు 0387201పరిధిలోని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.**అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు లబ్దిదారులకు ఉపయోగపడేవిధంగా క్యూ ఆర్ కోడ్ ఆధారిత కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అందించడం జరుగుతుందని అన్నారు.