నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అప్పుల బాధ భరించలేక ఓ వ్యక్తి పురుగుల మందు సేవించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మూడవ టౌన్ ఎస్ఐ హరిబాబు సోమవారం తెలిపారు. మూడవటం పరిధికి చెందిన మానేయకుర్ రమేష్ 44 ఆర్ పి ఫుట్వేర్ వ్యాపారం చేస్తున్నారు. ఈనెల 1వ తేదీన అప్పుల బాధతో గడ్డి మందు తాగగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.