కామారెడ్డి జిల్లాలో ప్రతిరోజు ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాలతో తనిఖీలు నిరంతరం కొనసాగుతుండగా.. అనేక మంది పోలీసులకు పట్టుబడుతున్నారు. వీరిని కోర్టులో హాజరు పరుస్తూ శిక్షలు విధిస్తున్నారు. ఇటీవల ఒక వ్యక్తికి సమాజ సేవ చేయాలంటూ కోర్టు వినూత్న శిక్ష విధించింది. శుక్రవారం ఒక్కరోజే 91 మందికి శిక్షలు ఖరారయ్యాయి. ఇందులో 16 మందికి ఒకరోజు జైలు శిక్షతో పాటు రూ.1100 జరిమానా విధించడం గమనార్హం. ఒకరికి 2 రోజుల జైలు శిక్షతో పాటు రూ.200 జరిమానా విధించింది. ఇంకా 74 మందికి ఒక్కొక్కరికి రూ.1100 చొప్పున కోర్టు జరిమానా విధించింది. వీరిలో వివిధ మండలాలకు చెందిన వారు ఉన్నారు.