కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పై కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. సీబీఐ విచారణ నిరసిస్తూ మంగళవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బీఆర్ఎస్ నాయకులు రోడ్డు పై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు చట్టబద్ధత లేని. ఘోష్ నివేదికతో కాళేశ్వరం పై సిబిఐ విచారణకు ఎలా ఆదేశించారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై అసత్య ప్రచారం చేస్తూ. బీఆర్ఎస్ పై కుట్రపూర్వక చర్యలకు కాంగ్రెస్ సర్కార్ పునుకుందనీ ఆరోపించారు. కాంగ్రెస్ పాలన వద్దురా .. కేసీఆర్ పాలన ముద్దురా అంటూ నినాదాలు చేశారు.