సీజనల్ వ్యాధుల నేపథ్యంలో రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతోంది. ముఖ్యంగా చిన్నారులు విషజ్వరాల బారిన పడి ఆసుపత్రికి వస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఆదివారం ఉదయం ఆసుపత్రిలో చికిత్స కోసం సుమారు 10 మంది చిన్న పిలలు వచ్చారు. వీరు కాక ఇప్పటికే పదుల సంఖ్యలో ఆసుపత్రిలో అడ్మిషన్ లో ఉన్నాను. వైద్యుల కొరతతో పాటు ఆదివారం కావడంతో వారికి సరైన చికిత్సలు అందడంలేదని రోగులు వాపోతున్నారు.