సిరిసిల్ల పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెండింగ్ స్కాలర్షిప్ ల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 24 గడుస్తున్నా స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో అలసత్వం వహించడం సరికాదన్నారు. రాష్ట్రంలో 8వేల కోట్ల రూపాయలు బకాయి ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలని అన్నారు. వాటిని విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న