అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని గ్రామాల్లో వినాయక చవితి వేడుకలకు పోలీసుల అనుమతి తప్పనిసరి అని ఎస్ఐ శివ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఎస్సై శివ మాట్లాడుతూ గ్రామాల్లో ఈనెల 27 నుంచి కొనసాగే వినాయక చవితి వేడుకల నిర్వహణ చేపట్టే ఉత్సవ కమిటీలు, చవితి సేవాసమితి సభ్యులు వేడుక నిర్వాహకులు తప్పనిసరి తెలిపారు. వేడుక నిర్వహణ విధి విధానాల మేరకు పోలీసులు అనుమతులు తీసుకోవాలని ఎస్ఐ పేర్కొన్నారు.