ప్రభుత్వ ఉద్యోగులకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండేలాచర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ ను తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి కోరారు గురువారం సాయంత్రం 6:30 సమయంలో మాట్లాడారు. నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న లైసెన్స్ కానీ వాహనాలకు ఇన్సూరెన్స్ కానీ చాలామంది తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అవగాహన కల్పించాల్సిన చాలామంది ప్రభుత్వ ఉద్యోగులకే డ్రైవింగ్ లైసెన్స్ లేదని చెప్పారు. తాడిపత్రి మున్సిపాలిటీలో లైసెన్స్ లేని వారికి జీతాలు ఇవ్వమని చెప్పడంతో ఎల్ఎల్ఆర్ కు అప్లై చేశారని తెలిపారు. ఇప్పటికైనా అందరూ లైసెన్స్ త తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.