మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని మేచరాజుపల్లి గ్రామ ప్రధాన రహదారిపై విద్యుత్ స్తంభం విరిగిపడటంతో రోడ్డుపై నడుస్తున్న వారు తృటిలో ప్రాణాలతో తప్పించుకున్నారు. గ్రామంలోని విద్యుత్ స్తంభాలు శిథిలావస్థలో ఉన్నాయని, కొన్నింటికి విద్యుత్ షాక్ వస్తుందని పలుమార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు శుక్రవారం సాయంత్రం 4:00 లకు ఆరోపణ చేశారు. ఈ సంఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు