రేపు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇంటి వద్దకు నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా వైకాపాశ్రేణులు తరలిరానున్నారు. రైతులకు యూరియా సక్రమంగా సరఫరా చేయలేదని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైకాపాశ్రేణులు ఆర్డీవో కార్యాలయం ముట్టడి కి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి భారీగా వైకాపాశ్రేణులు తరలిరానున్నట్లు తెలిసింది.