కాగజ్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ముందు ప్రధాన రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు. నెలల తరబడి వేచి చూసిన యూరియా అందకపోవడంతో ఆందోళన కార్యక్రమాలను చేపడుతున్నట్లు రైతులు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యంతోనే తమకు యూరియా అందడం లేదని అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారిపై రైతులు ఆందోళన చేయడంతో రోడ్డుకు ఇరుప్రక్కల భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది,