వరంగల్ జిల్లా విద్యుత్ షాక్ కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిన వానరానికి ప్రాణం పోసి మానవత్వాన్ని చాటాడు ఓ వ్యక్తి. పర్వతగిరి మండలం కల్లెడ ఆర్డిఎఫ్ కళాశాల సమీపంలో ఓ వానరం విద్యుత్ షాక్ కు గురై రోడ్డుపై పడిపోయింది. ఇది చూసిన చింతల పవన్ అనే వ్యక్తి వానరం ఎంత చూసిన ఎటు కదలక పోవడంతో హుటాహుటిన పర్వతగిరి లోని పశు వైద్యశాలకు తరలించి.. పశువైద్యులు రాజు సలహాతో దానికి ప్రథమ చికిత్స అందించాడు. ప్రాణాలు కోల్పోయింది అన్న వానరం పవన్ చేసిన ప్రయత్నంతో స్పృహలోకి వచ్చింది. దీంతో మూగ జీవి ప్రాణాలు కాపాడిన పవన్ ను స్థానికులు అభినందించారు.