కుందుర్పి మండల కేంద్రంలోని పిల్ల గుండ్ల వద్ద ఉన్న జైనుల కాలం నాటి శిలా శాసనాలు, దేవతా విగ్రహాలతో పాటు బురుజులను సైతం గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. గుప్త నిధుల కోసం శిలా శాసనాలను, దేవతా విగ్రహాలను ధ్వంసం చేసి ఉంటారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేసి దొంగలను పట్టుకొని అరెస్టు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.