గురువారం మధ్యాహ్నం 12 గంటలకు వరంగల్ ఎంపీ కడియం కావ్య సిపి సన్ ప్రీత్ సింగ్ కలెక్టర్ సత్యసారదా దేవి కమిషనర్ చాహత్ వాజ్పేయిలు , వరంగల్ నగరంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. నగరంలోని చిన్న వడ్డేపల్లి తదితర ప్రాంతాలను పరిశీలించిన వారు ఈనెల ఐదున నిమజ్జనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం గణేష్ నిమజ్జనం సులభంగా జరుగుటకు కావలసిన భారీ కేడింగ్ మరియు అధిక సంఖ్యలో క్రేన్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.