బెల్లంపల్లి పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు ర్యాగింగ్ నియంత్రణపై వన్ టౌన్ సిఐ శ్రీనివాస్ అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ విద్యాసంస్థలలో ర్యాగింగ్ కు పాల్పడటం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందన్నారు ఈ చర్యల వలన విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడేవిధంగా ఉంటుందని ముఖ్యంగా సీనియర్ల ముసుగులో జూనియర్ విద్యార్థుల పట్ల అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తూ విద్య సంస్థల నుండి తొలగించడంతోపాటు క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు