వ్యవసాయ రంగంలో ఆరుగాలం శ్రమించే అన్నదాతకు ఏడాది పాటు అండగా నిలిచే బసవన్నలు (ఎడ్లు) కు ఒక్కరోజు విశ్రాంతి ఇచ్చి, వాటిని పూజించే పండగనే పొలాల అమావాస్య పండుగ. ఈ వేడుకలను ప్రజలు రైతుకు ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగానే జైనథ్ మండలంలోని తన స్వగ్రామమైన దీపాయి గూడలో జరిగిన పొలాల వేడుకల్లో మాజీ మంత్రి పాల్గొని, కుటుంబ సమేతంగా ఎడ్లకు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులతో కలిసి పండగ వేడుకల్లో ఉత్సాహంగా గడిపారు.మనం జరుపుకునే ప్రతి పండుగ మన సంస్కృతి సాంప్రదాయాలను చాటిచెబుతాయని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. -------