రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ఉత్తమ సేవ అందించాలని వ్యవసాయ శాఖ అధికారులను SRCL కలెక్టర్ సందీప్ కుమార్ ఆదేశించారు. వ్యవసాయశాఖపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా మండలాల్లో ఏఏ పంటలు సాగు చేశారు? ఎరువులు ఇతర సామగ్రిపై ఆరాతీశారు.