చివ్వెంల మండలం వట్టిఖమ్మం పహాడ్ గ్రామంలో యూరియా ఎరువులు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నాయని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కోసం ఉదయం నుంచీ బారులు తీరినా, ఒక్క బస్తా కూడా తమకు అందడం లేదని వాపోయారు. తమ సమస్యను పట్టించుకునేవారే లేరని, అధికారులు తక్షణమే స్పందించి రైతులకు యూరియా అందేలా చూడాలని వారు కోరారు.